పాముకాటుతో విద్యార్థి మృతి

కూకట్‌పల్లి :కూకట్‌పల్లి శంషీర్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో పాముకాటుకు గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. రెండో తరగతి చదువుతున్న కిషోర్‌ అనే విద్యార్థిని పాఠశాల ఆవరణలో ఈరోజు పాము కాటేసింది. ఉపాధ్యాయులు వెంటనే కిషోర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పతికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.