పాము కాటుకు విద్యార్థి మృతి

కర్నూలు – మెదక్‌ కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని సంకలాపురం గ్రామంలో పాము కాటుతో ఏ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి తిమ్మయ్య కుమారుడు రాజశేఖర్‌ (11) శనివారం ఉదయం 8 గంటలకు భోజనం చేసి ఇంటి బయటకు వస్తుండగా పాము కాటు వేసింది. పాము కాటుతో విద్యార్థి కేకలు వేశాడు. అరువులు విన్న తల్లిదండ్రులు విషయం తెలుసుకుని అతన్న కర్నూలు అస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే అతను ప్రాణాలు విడిచారు. ఇటీవల హైదరాబాదు సమీపంలో కూడా ఓవిద్యార్థి పాము కాటుతో మరణించాడు.