పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉంది.:చిదంబరం

న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి సూచీ ప్రోత్సాహకరంగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు. విపక్ష నేతలను కలిశామని, ఐదు కీలక సంస్కరణల బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతక్ష పన్నుల వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇంకా మెరుగుపడతాయని పేర్కొన్నారు. వారాంతంలోగా బీమా బిల్లుపై వినక్షాలతో చర్చిస్తామని చిదంబరం తెలియజేశారు.