పార్టీ నాయకత్వం అన్ని స్థాయుల్లోనూ అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలి: అద్వానీ

సూరజ్‌కుండ్‌: ‘అవినీలపై కాంగ్రెస్‌ని మనం విమరిశస్తున్నప్పుడు మన పార్టీవారిపై ఏ చిన్న ఆరోపన వచ్చినా అది పెద్ద గొడవైపోతుంది. అందుకే ముందుగా మనం మన ఇంటిని దిద్దుకోవాలి. ఎలాంటి విమర్శలకూ తావులేకుండా చూసుకోవాలి అంటూ భాజపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ పార్టీ సహచరులకు బోధించారు. సూరజ్‌ కుండ్‌లో జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. పార్టీ నాయకత్వం అన్ని స్థాయుల్లోనూ అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలని ఆయన నొక్కిచెప్పారు.