పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా ను ఉపయోగించాలి..
యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి సెప్టెంబర్21/
తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్
సోషల్ మీడియాను యువజన, విద్యార్థి విభాగాలు , ఉపయోగించుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మన్, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి లు అన్నారు. బుధవారం తుర్కపల్లి మండలంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం మండల కేంద్రంలోని జే.ఎం. ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన యువజన విద్యార్థి విభాగ సోషల్ మీడియా పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి అస్త్రంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని అన్నారు. ఇతర పార్టీ నాయకులు కొంచెం పని చేస్తే పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారని ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న టిఆర్ఎస్ చెప్పుకోలేక సోషల్ మీడియాలో వెనుకబడిందని అన్నారు. దేశ ప్రజలు తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు కావాలని జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలని ఆకాంక్షిస్తున్నట్లు అన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖనిజభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రీశాంక్, టిఆర్ఎస్ స్టేట్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, జెడ్పి వైస్ చైర్మన్ బిక్కు నాయక్, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, యువ నాయకుడు గట్టు తేజస్వి నిఖిల్, వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్ ,మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ పలుగుల నవీన్, మాదాపూర్ ఉపసర్పంచ్ సీత రాజు, సెక్రెటరీ జనరల్ శగార్ల పరమేష్ , నల్ల శ్రీకాంత్, ఐలేష్ యాదవ్, సీస భరత్ గౌడ్ ,వెంకటేష్, యువజన విద్యార్థి, విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.