పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులతో అట్టుడికిన పార్లమెంట్ రేపటికి వాయిదాపడింది. మథ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదాపడిన లోక్ సభ రెండుగంటలకు మళ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాగ్ నివేదిక ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. ఈ నివేదికను పార్లమెంట్ స్థాయిసంఘంలో సవాలుచేస్తామన్నారు. ఆయన సమాధానాన్ని పట్టించుకోకుండా విపక్షాలు రాజీనామాకు పట్టుబట్టటంతో లోక్‌సభ రేపటికి వాయిదాపడింది. రాజ్యసభలోకూడా ఇదే విషయంగా గందరగోళం చెలరేగటంతో పార్లమెంట్ ఉభయసభలు మళ్లీ రేపటికి వాయిదావేశారు.