పార్లమెంట్‌ ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం పార్లమెంట్‌ ఉభయసభల్లో దుమారం రేపింది. ఇవాళ ఉభయ సభులు ప్రారంభమైన ఐదు నిమిషాలకే ప్రతిపక్షాలు ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలకు విపక్షాలు అంతరాయం కలిగించడంతో సభను వాయిదా పడ్డాయి. సభా కార్యక్రమాలకు విపక్షాలు అంతరాయం కలిగించడంతో సభను వాయిదా వేస్తోన్నట్టు లోక్‌సభలో స్పీకర్‌ మీరాకుమార్‌, రాజ్యసభలో ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీలు ప్రకటించారు.