పార్లమెంట్‌ హౌస్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌ సజావుగా సాగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధి, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జి, మాయవతి, రాహుల్‌గాంధి, బీజేపి సీనియర్‌ నేత ఎల్‌ కె. అద్వాని, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ.సంగ్మా తదితరులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.