పాలసేకరణను నిలిపివేయొద్దు : బొత్స

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ పాలసేకరణను  నిలిపివేయొద్దని పీసీసీ చీఫ్‌, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈమేరకు ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. పాలసేకరణ నిలిపివేస్తే రైతులు, పాల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారని వెల్లడించారు.