పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రారంభించిన మంత్రి

కందుకూరు : కందుకూరు పట్టణంలోని టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్‌ కళాశాలను మున్సిపల్‌ శాఖ మంత్రి మహీధర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు అవసరమైన సామాగ్రి పూర్తిగా ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనితా రాజేంద్ర, కళాశాల ప్రిన్సిపల్‌ నాగరాజారావు, తదితరులు పాల్గొన్నారు.