పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 : నెక్లెస్‌రోడ్డులో గల మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు ఘాట్‌ వద్ద ఆదివారంనాడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ వర్ధంతి సందర్భంగా మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌, ఎంపి అంజన్‌కుమార్‌యాదవ్‌ తదితరులు ఘాట్‌కు వచ్చి పీవీ స్మారకం వద్ద నివాళులర్పించారు. ఇదిలా ఉండగా అక్కడ జరిగిన సంస్మరణ సభలో పీవీ సేవలను పలువురు కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి పీవీ చేసిన సేవలు అపూర్వమైనవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో భూ సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. అలాగే ప్రధానిగా ఉన్న సమయంలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థికాభివృద్ధికి పాటు పడ్డార న్నారు. జాతికి ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు.