పురుగుల మందుతాగి భార్యభర్తల ఆత్మహత్య

మునుగోడు:క్రిష్టాపురం గ్రామంలో భార్యభర్తలిద్దరు పురుగుల మందు తాగి శనివారం రాత్రి మృతి చెందారు. మిర్యాలగూడ మండలం వెంకటాపురం నుంచి బతుకుదెరువు కోసం క్రిష్టాపురం గ్రామానికి వచ్చిన శ్రీరాములుకు ఇద్దరు భార్యలు. మద్యనికి బానిసైన అతన్ని మొదటి బార్య ముత్యాలమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీరాములు(35) అతని రెండో భార్య సైదమ్మ (30) పురుగుల మందుతాగారు. ఇది గమనించిన పలువురు గ్రామస్తులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందారు. మృతురాలి తల్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొండల్‌రెడ్డి తెలిపారు.