పెట్రోలు ధరలు పెంపు యోచన లేదు: జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు పెంపు యోచన ప్రస్తుతానికైతే లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి వెల్లడించారు. పెట్రోలు ధరలను కేంద్రం పెంచనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. పెట్రోల్‌ ధరల పెంపుపై కేంద్ర మంత్రి మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఢిల్లీలో మీడియాతో అన్నారు.