పెట్రో ధరలను నిరసిస్తూ కొదురుపాకలో రాస్తారోకో

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు ధరలను నిరసిస్తూ, బిజెపి అధ్వర్యంలో బోయినిపెల్లి మండలంలోని కొదురుపాక ఎక్స్‌ రోడ్‌లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎడ్లబండి, మోటార్‌ సైకిళ్ళకు తాళ్ళు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళుతూ కేంద్రం వైఖరిపై తమ నిరసన తెలియజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు లింగంపెల్లి శంకర్‌ మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పెరిగిన నిత్యావసర వస్తువులతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. గడచిన 8 సంవత్సరాల కాలంలో సామాన్యునికి అత్యవసరంగా మారిన పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌, కిరో సిన్‌ లాంటి నిత్యావసరాలకు సంబంధించిన ధరలు కొండెక్కి కూచున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల శాఖ అధ్యక్షులు మిట్లపెల్లి శ్రీనివాస రెడ్డి, నాయకులు నాగరాజు, రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.