పెరగనున్న ఆటోచార్జి!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జంట నగరవాసులకు ఆటో ప్రయాణం భారం కానున్నది. మంగళ వారం మధ్యాహ్నం ఆటో సంఘాల ప్రతినిధులు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య చర్చలు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో చర్చలు కొనసాగాయి. చార్జిల పెంపుపై చర్చ కొనసాగుతోంది. మరో గంటలోగా చార్జిల పెంపుపై ప్రభుత్వ తుది నిర్ణయం వెల్లడి కానున్నది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న కనీస ఆటోచార్జిని రూ.14 నుంచి 20 రూపాయల వరకు పెంచాలని, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 10 రూపాయల చొప్పున పెంచాలని ఆటోల సంఘాల ప్రతినిధులు డిమాండు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం రెండు రూపాయలు మాత్రమే పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కనీస చార్జి 14 రూపాయలు.. ప్రతీ కిలోమీటరుకు ఎనిమిది రూపాయలుగా ఉన్న విషయం విదితమే.