పొందూరు రక్షిత తాగునీటి పథకానికి మోక్షం

శ్రీకాకుళం, జూన్‌ 25 : గత కొనేళ్లుగా పొందూరులోని సంతోషిమాత ఆలయం సమీపంలో అర్ధంతంగా నిలిచిపోయిన రక్షిత తాగునీటి పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇప్పటికే ఇక్కడ లైదాంలో గల రిల్లిగడ్డ నుంచి పథకం నుంచి ఉపరితల ట్యాంక్‌ వరకు 4.5 కిలో మీటర్ల మేరా పైపులైను వేయగా ప్రస్తుతం కొల్లిపేట గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్‌ కింద గొట్టాలను అమర్చే పనులు జరుగుతున్నాయని ఈ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ పనులు చేపట్టేందుకు స్థానికంగా ఉన్న నాయకులు ఒక కమిటీగా ఏర్పడి ముందుకు రాగా, ఆమదాలవలస గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ మాధవరావు, గోపాలకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. తొలి విడతలో పొందూరు పట్టణంలో 40 కూళాయిలు, ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు.