పోలవరం టెండర్లు ఖరారు

హైదరాబాద్‌: పోలవరం టెండర్లని ప్రభుత్వం ఖరారు చేసింది. ట్రాన్స్‌ట్రాయ్‌ అనే ప్రైవేటు సంస్థకు టెండర్లను అప్పగిస్తూ నీటిపారుదల శాఖ నిర్ణయం తీసుకొంది. 14.055శాతం తక్కువ మొత్తానికి టెండరు దాఖలు చేసిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు ఈ టెండరు ఖరారైంది. 15 రోజుల్లో ధృవపత్రాలు, బ్యాంకు  పూచీకత్తు సమర్పించాలని సంస్థకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ టెండరు ఖరారు సమాచారాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు లిఖిత పూర్వకంగా అందించింది.