పోలీసులకు ప్రాణాపాయం లేదు:కామినేని వైద్యులు…

నల్లగొండ: జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు ప్రస్తుతం ప్రాణాపాయం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్సై సిద్ధయ్యకు మెదడు భాగంలో, ఛాతిలో బుల్లెట్లు తగిలాయని ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గాయపడిన మరో ఇద్దరు సీఐలు, ఒక కానిస్టేబుల్ పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ఎస్సై సిద్ధయ్య స్వస్థలం జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లావాసి.