పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

కందుకూరు , జూలై 28 : వివిపాలెం పోలీసులను ప్రేమజంట నవ్వులూరి మణిబాబు రామగీత వివిపాలెం మండల పోలీసులను తమకు రక్షణ కల్పించాలని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే లింగపాలెం గ్రామానికి చెందిన మణిబాబు కందుకూరు పట్టణానికి చెందిన గీత ప్రేమించుకొని వివాహమాడుటకు అనేక సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. మేజర్లమైన తాము ఇరువురం మొదట మాలకొండ దేవస్థానానికి వివాహం చేసుకునేందుకు సాక్షులు లేరని దేవస్థాన అధికారులు వివాహం జరిపించడం లేదని తెలిపారు. అనంతరం ఒక చిన్న దేవాలయంలో వివాహం జరుపుకున్నట్లు తమ పెద్దల నుండి తమకు ముప్పు వాటిల్లిద్దనే భయంతో పోలీసులను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. అయితే వివిపాలెం మండల ఎస్‌ఐ సురేష్‌బాబు వీరిరువురు మేజర్లు అని మీకు ఎవరివలన ఎలాంటి సమస్య ఉండదని పంపించివేశారు.