పోషకాహారం ఉన్న ఆహారాన్ని భుజించాలి
-అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం
-సర్పంచ్ కాయిత రాములు
సైదాపూర్: జనం సాక్షి మార్చి20.పోషకాహారం ఉన్న ఆహార పదార్థాలను భుజించి ఆరోగ్యంగా జీవించాలని సర్పంచ్ కాయిత రాములు కోరారు. సోమవారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పోషకాహార లోపం వల్ల గర్భిణీలు, బాలింతలు చిన్నారులు, రక్తహీనతతో అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోషక పదార్థాలు ఉన్న పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, లభించే ఖనిజ లవణాలు ఉన్న ఆహారాలను భుజించాలని సూచించారు. పోషకాహార లోపం వల్ల నీరసం, నిసత్వ, శరీరం ఉబ్బడం, పిల్లల్లో ఎదుగుదల లోపించడం తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రంలో నెలరోజుల పాటు పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎలాంటి ఆహార పదార్థాలు భుజించాలనే దానిపై అవగాహన ఏర్పాటు చేయడం అర్సనీయమన్నారు. బెల్లం, పప్పు దినుసులు, ఆకుకూరలు ,మొలకలు ,కోడిగుడ్లు ,పాలు మాంసకృతులు, చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను ప్రతినిత్యం భుజించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యారాలు కవిత, అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం, ఉపాధ్యాయురాలు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.