పోస్టాఫీసులో డబ్బు మాయం

విజయవాడ, జూలై 27 : అగీరిపల్లి హెడ్‌ పోస్టాఫీసులో చోరి జరిగింది. శుక్రవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. 27,000రూపాయలు అపహరణకు గురయ్యాయి. తపాల కార్యాలయం తెరిచి చూసేసరికి వెనకవైపు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. దీంతో అనుమానం వచ్చి కౌంటర్లు తనిఖీ చేయాగా 27,000రూపాయలు కనిపించలేదు. ఇది దొంగలపనేనని గ్రహించిన పోస్ట్‌మాస్టర్‌ వెంకటప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు.