ప్రధాని సభకొచ్చే ధైర్యం లేదా?

` నవరణే పుస్తకంపై సమాధానం చెప్పాలి
` రాహుల్, ప్రియాంక డిమాండ్
న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇంకా ప్రచురణ కాని నరవణె రాసిన పుస్తకాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. నేడు ప్రధాని మోదీ లోక్‌సభకు వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ మోదీ వస్తే.. తానే స్వయంగా ఆయన వద్దకువెళ్లి ఈ పుస్తకాన్ని అందజేస్తానన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. పార్లమెంటు ద్వారం వద్ద విపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి అటుగా రాగా.. ‘ఇదిగో ఇక్కడ ఓ ద్రోహి నడుచుకుంటూ వెళ్తున్నాడు’ అంటూ రాహుల్ విమర్శలు చేశారు. ఈ క్రమంలో బిట్టుకు కరచాలనం చేయడానికి ముందుకొస్తూ.. “ద్రోహి స్నేహితుడా” అంటూ చురకలంటించారు. నువ్వు తిరిగి (కాంగ్రెస్‌లోకి) వస్తావంటూ ఎద్దేవా చేశారు. దీనికి కేంద్ర మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్‌తో కరచాలనం చేసేందుకు నిరాకరిస్తూనే.. ‘విÖరు దేశానికి ద్రోహం చేశారు’ అని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన బిట్టు.. 2024 ఎన్నికల ముందు భాజపాలో చేరారు.
ప్రభుత్వం భయపడుతోంది: నరవణె పుస్తకంపై ప్రియాంక గాంధీ
భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె పుస్తకంలోని ఓ అంశంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఆ పుస్తకం చదివితే చైనా మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు మన దేశ నాయకత్వం దానిపై ఎలా స్పందించిందనే విషయం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు.పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా నాయకులు మాట్లాడేటప్పుడు కూడా పుస్తకాలు, పత్రికల గురించి ప్రస్తావిస్తారన్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవి. కానీ, ఇప్పుడు ఓ వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమే ముందుకు తీసుకొస్తున్నారని విమర్శలు చేశారు. వారికి సంబంధించి ఏ విషయాలు బయటపడతాయోనని ప్రభుత్వం భయపడుతోందన్నారు. అందుకే ఆ పుస్తకం ప్రచురణకు అనుమతించడం లేదని ఆరోపించారు.

ఇలా మొదలు.. అలా వాయిదా..
` ఐదు నిముషాలకే లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ(జనంసాక్షి): పార్లమెంటు బ్జడెట్ సమావేశాల్లో యూరోపియన్ యూనియన్, అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పార్లమెంటు ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో బుధవారం కూడా లోక్‌సభ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష సభ్యులు ఈ ఒప్పందాలపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలతో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపై తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడడనున్నారు. ఇకపోతే భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె పుస్తకంలోని ఓ అంశంపై వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ఆ పుస్తకం చదివితే చైనా మన సరిహద్దుల్లోకి వచ్చినప్ప్పుడు మన దేశ నాయకత్వం దానిపై ఎలా స్పందించిందనే విషయం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడు తోందన్నారు. అందుకే తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడనీయ కుండా చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా నాయకులు మాట్లాడేటప్ప్పుడు కూడా పుస్తకాలు, పత్రికల గురించి ప్రస్తావిస్తార న్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసేవి. కానీ, ఇప్ప్పుడు ఓ వ్యక్తి అభిప్రాయాన్ని మాత్రమే ముందుకు తీసుకొస్తున్నారని విమర్శలు చేశారు. వారికి సంబంధించి ఏ విషయాలు బయటపడతాయోనని ప్రభుత్వం భయపడు తోందన్నారు. అందుకే ఆ పుస్తకం ప్రచురణకు అనుమతించడం లేదని ఆరోపించారు. ఇంకా ప్రచురణ కాని నరవణె రాసిన పుస్తకాన్ని విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన విÖడియాతో మాట్లాడుతూ.. నేడు ప్రధాని మోదీ లోక్‌సభకు వస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ మోదీ వస్తే.. తానే స్వయంగా ఆయన వద్దకువెళ్లి ఈ పుస్తకాన్ని అందజేస్తానన్నారు.