ప్రాణాలు పోతున్నాయి కాపాడండి

ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో ధర్నా
బచ్చన్నపేట జనవరి 3 ( జనం సాక్షి):బచ్చన్నపేట లో రోడ్డు బాగాలేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని దుమ్ము దులితో శ్వాసకోశ వ్యాధితో రోగాల పాలు అవుతున్నారని రహదారి వెంటనే వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ ఫైట్ ఫర్ బచ్చన్నపేట ఆధ్వర్యంలో మంగళవారం భారీ రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫైట్ ఫర్ బచ్చన్నపేట వ్యవస్థాపకులు పైస రాజశేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం మూలంగా ప్రతిరోజు ఎంతోమంది ఈ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం పార్టీ ప్రభుత్వ ల వైఫల్యం వల్లనే బచ్చన్నపేట ప్రజలకు శాపంగా మారిందని వారు అన్నారు.రోడ్డుపై ఉన్న గుంతలు మృత్యు గుంతలుగా మారాయని బైకులపై వెళ్లిన పలువురు యువకులు మృతి చెందిన సంఘటనలు ఎన్నో జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు పత్రికల ద్వారా సమస్యను విన్నవించిన కూడా అధికార యంత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ రిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వారి షాపుల్లోకి విపరీతంగా దుమ్ము వెళ్లడంతో వారు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. మాస్క్ పెట్టితేనే షాపు తెరవాలే తప్ప, వేరే మార్గం లేదన్నారు. కలెక్టర్ రావాలి. రోడ్డు నిర్మాణం పై హామీ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా విరమించాలని ఎస్‌ఐ హమీద్ కోరిన వారు వినలేదు. జిల్లా స్థాయి అధికారులు రావాలి, తమకు కచ్చితంగా హామీ ఇవ్వాలి అంటూ మొండికేశారు.
విషయం తెలుసుకున్న తహసిల్దార్ హస్సేన్ రాస్తారోకో వద్దకు వచ్చి, రోడ్డు నిర్మాణంపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి, పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
కార్యక్రమంలో ఫైట్ ఫర్ బచ్చన్నపేట వ్యవస్థాపక సభ్యులు మాల్యాల అఖిల్ మాల,అల్వాల రాజు,దండుగుల మురళి,కొత్తపల్లి శ్రీను, యాకం రెడ్డి,అష్రఫ్ ,దేవరకొండ మహేష్, పాల సందీప్ ,గందమల నాగరాజు,స్టాలిన్,రసూల్ ,సత్యనారాయణ,కర్రె విజయ్,గందమల్ల సమ్మెశ్వర్, శ్రీకాంత్,నర్సింగ సతిష్ సాయికుమార్ నాయకులు కొండి వెంకటరెడ్డి ,జిల్లా సందీప్, దొంతుల చంద్రమౌళి ,నగేష్ ,చింతల వెంకటయ్య,గిరబోయిన బలసిద్ధులు,నగేష్, బషీర్,వెంకటేశ్వర్లు,అజయ్, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


