పోచంపల్లి మున్సిపల్ బరిలో అభ్యర్థులు వీరే
84 నామినేషన్లకు 44 ఉపసంహరణలు
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 4 (జనం సాక్షి): పురపాలక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో పాటు ఆయా రాజకీయ పార్టీల బీఫారాల అందజేత మంగళవారంతో ముగిసింది. పోచంపల్లి మున్సిపాలిటీలోని 13 వార్డులకు గాను మొత్తం 84 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వారిలో 44 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 13 వార్డులకు కలిపి 40 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.వార్డు వారీగా అభ్యర్థులు:1వ వార్డు:గుండ్ల నవనీత (కాంగ్రెస్), సన్న లలిత (బీఆర్ఎస్), శ్రీరామ్ మంజుల (బీజేపీ)2వ వార్డు:కొండమడుగు ఎల్లస్వామి (కాంగ్రెస్), కొండమడుగు రవి (బీఆర్ఎస్), కొండమడుగు ఉప్పలయ్య (బీజేపీ)
3వ వార్డు:రావుల జంగయ్య (కాంగ్రెస్), ఏనుగు జంగారెడ్డి (బీఆర్ఎస్)
4వ వార్డు:నల్ల నాగేశ్వర్ (కాంగ్రెస్), చెరుకు వెంకటేశం (బీజేపీ), పెద్దల చక్రపాణి (బీఆర్ఎస్)
5వ వార్డు:బాత్క లింగస్వామి (బీఆర్ఎస్), బాత్క శంకర్ (కాంగ్రెస్), బడుగు శ్రీకాంత్ (బీజేపీ)
6వ వార్డు:గంజి జయమ్మ (కాంగ్రెస్), కర్నాటి వరలక్ష్మి (బీఆర్ఎస్), దోర్నాల సంగీత (బీజేపీ)
7వ వార్డు:మంగళపల్లి లావణ్య (కాంగ్రెస్), రాపోలు కావ్య (బీఆర్ఎస్), సీత మానస (బీజేపీ)
8వ వార్డు:దేవరాయ కుమార్ (కాంగ్రెస్), దేవరాయ శివలింగం (బీఆర్ఎస్)
9వ వార్డు:భోగ భానుమతి (కాంగ్రెస్), జేల్ది అంజమ్మ (బీఆర్ఎస్), వలందాస్ మాధవి (బీజేపీ)
10వ వార్డు:చేరాల లహరి (బీఆర్ఎస్), కొయ్యడ రజిని (కాంగ్రెస్), తంగెళ్ల అండాలు (బీజేపీ)
11వ వార్డు:కుడికాల రాంనరసింహ (కాంగ్రెస్), కుడికాల అఖిల (బీఆర్ఎస్), కొంగరి బాల నరసింహ (బీజేపీ)12వ వార్డు:తడక వెంకటేశ్వర్లు (కాంగ్రెస్), గుండు మధు (బీఆర్ఎస్), ఈడెం సాయి కృష్ణ (బీజేపీ)13వ వార్డు:సురపల్లి రాధిక (కాంగ్రెస్), చింతకింది శ్వేత (బీఆర్ఎస్), చెరుకు నికిత (బీజేపీ)కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్ని వార్డుల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ 3వ మరియు 8వ వార్డులను మినహాయించి మిగతా అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐ(ఎం) పార్టీ కేవలం 4వ వార్డులో మాత్రమే పోటీ చేస్తోంది.


