ఎదురులేని కాంగ్రెస్
` మున్సిపాలిటీల్లో సత్తాచాటుతాం
` సన్నబియ్యం తీసుకున్న వారంతా ఓటేయాలి
` మున్సిపల్ ఎన్నికల తరవాత రైతుభరోసా
` ఏప్రిల్ తర్వాత పేదలకు లక్షలాది ఇళ్లు
` రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్
` తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్
` తెలంగాణ తల్లి మన సోనియమ్మ
` మిర్యాలగూడ ప్రజాపాలన`ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
` పలు అభివద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
` హాజరైన మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్క్ష్మణ్
మిర్యాలగూడ(జనంసాక్షి): రాష్ట్రంలో జరిగిన అభివద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురే లేదు.. విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ’ప్రజా పాలన ` ప్రజా విజయోత్సవ’ సభలో సీఎం ప్రసంగించారు. రేషన్ కార్డుల కోసం గతంలో పదేళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్ప్పున సన్న బియ్యం ఇస్తున్నాం. సన్న బియ్యం వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందుంది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆరఎస్ బీఫాం విÖద పోటీ చేస్తున్న ఆడబిడ్డలకు కూడా ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపలేదు. రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతు భరోసా కింద రూ.6వేల చొప్ప్పున రూ.9వేల కోట్లు ఇచ్చాం. మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా నిధులు జమ చేస్తాం. దేశంలో అత్యధికంగా రైతుల కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఏప్రిల్‌లో కొత్త బ్జడెట్‌లో లక్షలాది ఇళ్లు పేదలకు ఇస్తాం. పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత తీసుకుంటాం. నల్గొండ జిల్లాపై కోపంతో ఎసఎల్‌బీసీని పక్కనపెట్టారు. ఎసఎల్‌బీసీ ఆగిపోతే మామ, అల్లుళ్లు దావతు చేసుకున్నారు. నల్గొండ ప్రజలు ప్లోరైడ్ నీళ్లు తాగడానికి కారణం బీఆరఎస్. రెండేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఎసఎల్‌బీసీ పనులు చేపట్టాం. కేసీఆర్‌కు పోలీసులు నోటీసు ఇస్తే.. తెలంగాణ జాతికి ఇచ్చినట్టు చెబుతున్నారని సీఎం విమర్శించారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను మార్చి, అభివద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం విమర్శించారు. సన్నబియ్యం పొందుతున్న లబ్దిదారులంతా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందిస్తామని సీఎం హావిÖ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నిజంగా వరంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళలు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బిఆరఎస్ అడ్రస్ గల్లంతు అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇతర నాయకులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదని సీఎం విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్ ఉందని, రాబోయే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడతామని హావిÖ ఇచ్చారు. గత ప్రభుత్వం నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతో ªSఒఃఅ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ªSఒఃఅ ప్రమాదంలో 8 మంది మతి చెందితే మామ?అల్లుళ్లు సంబరాలు చేసుకున్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. గంజి గతి లేని నాయకులు బెంజ్ కార్లు కొనుగోలు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మిగితా నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీఎం ఆరోపిస్తూ.. జాతిపిత ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌నే జాతిపిత అని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని స్పష్టం చేశారు. రెండేళ్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అభివద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ, ‘కాంగ్రెస్ గెలిస్తే పేదవారు గెలుస్తారు‘ అని సీఎం అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి
తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన జయశంకర్ జాతిపిత అవుతారని, రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అవుతారని సీఎం అన్నారు. దోపిడీలు, దుర్మార్గాలు చేసిన వారు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. చేసిన తప్పులకు తలవంచుకుని ముక్కు నేలకు రాయాల్సింది పోయి తెలంగాణ సమాజాన్ని క్షమాపణ కోరకుండా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లో జానారెడ్డి కుమారుడికి కాకుండా భాస్కర్‌రావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మిర్యాలగూడ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తాకట్టు పెట్టారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వాపసు తీసుకోవాలని భాస్కర్‌రావు బెదిరిస్తున్నారన్న సీఎం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని చెప్పారు.భాస్కర్‌రావును నమ్మి ఎమ్మెల్యేను చేస్తే నాగార్జునసాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి ఓటమికి పనిచేశారని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలిచి తీరాలని నాయకులకు సూచించారు. రూ.వేల కోట్లు తీసుకువచ్చి మున్సిపాలిటీలు అభివద్ధి చేస్తామని, ఎన్నికల తర్వాత సాగర్, నందికొండలోని ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తామని హావిÖ ఇచ్చారు.
అన్నీ విÖ కుటుంబమే తీసుకుంది
విÖకు నోటీసులు ఇస్తే అందరికీ ఇచ్చినట్లయితే ఎర్రవల్లి, జన్వాడ ఫాంహౌస్‌లు మా ప్రజలకు ఇస్తారా? అని రేవంత్ ప్రశ్నించారు. మొయినాబాద్‌లోని హరీశ్‌రావు ఫాంహౌస్‌లో అందరినీ రానిస్తారా?, రూ.వేల కోట్లు కొల్లగొట్టిన దాంట్లో నిరుద్యోగులకు ఏమైనా ఇస్తారా? అని పెదవి విరిచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, మంత్రి పదవులు అన్నీ విÖ కుటుంబమే తీసుకుందని బీఆర్?ఎస్?ను నిలదీశారు. తెలంగాణ సమాజానికి ఏమైనా ఇచ్చారా?, చివరికి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి కూడా ఏవిÖ ఇవ్వలేదని మండిపడ్డారు.


