ప్రకాశం బ్యారేజిలోకి 27, 626 క్యూసెక్కుల వరదనీరు

విజయవాడ: కృష్ణానది ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాగులు, పెద్ద తరహా కాల్వలు పొంగి పొర్లటంతో మంగళవారం ఉదయం 27,626 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజిలోకి చేరింది. దీంతో 25 గేట్లను ఒక ఆడుగుమేర ఎత్తి 18 వేల 125 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజినుంచి కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 4,143 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ కాల్వకు 5 వేల ఎనిమిది, గుంటూరు చానల్‌కు 350 క్యూసెక్కుల  నీటిని విడుదల చేస్తున్నారు.