ప్రకాశం బ్యారేజీలో తగ్గుతున్న నీటి నిల్వ

విజయవాడ:  ప్రకాశం బ్యారేజీలో నీరు తగ్గు ముఖం పడుతుంది. 11అడుగుల నీటి మట్టానికి పడిపోయింది. అధికారులు తూర్పు డెల్టాకు 1806, పశ్చిమ డెల్టాకు 1216, గుంటూరు చానెల్‌కు 345 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఈ సాయంత్రానికి మరింత నీరు తగ్గే అవకాశం ఉంది.