ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 : తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఉచితాలు వద్దనడం సమంజసం కాదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల మండల కేంద్రంలో 16500 మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆసరా పెన్షన్లు ,కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్,రైతుబందు, బీమా వంటి పథకాలు అమలు చేస్తు అభివృద్ధిలో దూసుకెళ్తుందాని అన్నారు.కానీ కాంగ్రెస్, బిజెపి పార్టీ లు వారి పాలిస్తున్న రాష్ట్రలలో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు అమలు చేయడం లేద్దానరు. కానీ కేంద్రం ప్రభుత్వం ఉచితలు వద్దని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నరు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్, బిజెపి లకు గుణపాఠం చెప్పాలన్నారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ గెలిపించుకొని టిఆర్ఎస్ ప్రభుత్వన్ని అధికారంలోకి తెస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.