ప్రజాసంఘాలను అణచివేయాలని చూస్తే అది ప్రతిఘటనకు దారితీస్తుంది: అరుంధతీరాయ్‌

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారం కోసం ఉద్భవించిన మహిళా ఉద్యమ సంస్థలన్నీ కాలక్రమేణా స్వచ్ఛంద సంస్థలుగా మారుతున్నాయని ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతీ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన విప్లవ ప్రజాస్వామిక సంఘటన (ఆర్‌డీఎఫ్‌) నిషేధ వ్యతిరేక సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రజాసంఘాలను అణచివేయాలని చూస్తే అది ప్రతిఘటనకు దారితీస్తుందని ఆమె చెప్పారు. దేశంలో స్వలింగ సంపర్కంపై మాట్లాడుకుంటున్న జనం సమస్యలపైనా, ప్రభుత్వ ప్రజా వ్యతిరే విధానాలపైనా మాత్రం చర్చించుకోవడం లేదని అరుధతీరాయ్‌ ఆందోళన వ్యక్తంచేశారు.