ప్రణబ్‌కు ఓటు….జగన్‌కు బెయిల్…:వినోద్
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్ నేత వినోద తెలియజేశారు.ప్రణబ్‌ముఖర్జీకి ఓటు…జగన్‌కు బెయిల్..అన్ని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరు అని తాము అనుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య బేరం కుదిరింది… జగన్‌కు బెయిల్ వచ్చి నట్లేనని అన్నారు. ప్రణబ్ తెలంగాణ ద్రోహి అని తాము అనుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయకుండా ఉండేందుకు హక్కు ఉందని ఆయన అన్నారు. ఆంధ్రాలో ఆరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఉంటే తెలంగాణలో ఒకే ఒక్క ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఉందని ఆయన తెలియజేశారు. తెలంగాణలో మరిన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.