ప్రధానితో సూకీ సమావేశం

ఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాన్‌ సూకీ నేడు భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. అరగంటపాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. దశాబాద్దల పాటు పోరాడి గెలిచిన సూకీ దైర్యాన్ని ప్రధాని ప్రశంసించారని, ఆమెకు సదా తమ శుభాకాంక్షలు ఉంటాయని ఆయన చెప్పారని అధికారులు తెలియజేశారు. పాలన, న్యాయ తదితర శాఖలకన్నా ముందుగా ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనడం ముఖ్యమని నేతలిద్దరూ అభిప్రాయపడినట్లు సమాచారం.

తాజావార్తలు