ప్రధాని మన్మోహన్‌ను సోనియా సమర్థించడంపై ‘అన్నా’ ధ్వజం

సోనియా సమర్థించడంపై 'అన్నా' ధ్వజం

ప్రధాని మన్మోహన్‌ను సోనియా సమర్థించడంపై 'అన్నా' ధ్వజం

.సోమవారం దేశ రాజధానిలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మన్మోహన్‌సింగ్‌పై తాము చేసిన ఆరోపణలను  వ్యతిరేకిస్తూ ఆయనకు కితాబు ఇవ్వడంపై  హజారే  ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు కుంభకోణంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కాగ్‌ తప్పుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు తెచ్చారు.  కాగ్‌ లాంటి ప్రభుత్వ సంస్థలే ప్రధాని తప్పిదాన్ని ఎత్తిచూపడంతోనే తాము ఆరోపణలు చేశామే తప్ప వ్యక్తిగతంగా మన్మోహన్‌తో తమకెలాంటి వ్యతిరేకత లేదని అన్నా హజారే స్పష్టం చేశారు. వాస్తవాలను మరుగుపర్చే ప్రయత్నాలను సోనియాగాంధీ చేయడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.ప్రధానిని దోషిగా నిలబెట్టేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని అన్నా హజారే స్పష్టం చేశారు.