ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించాలి:మంత్రి ఏరాసు

కర్నూలు, వంబరు 22:  ప్రపంచమంతా తెలిసేలా తెలుగు భాషను గౌరవించి ప్రతి ఒక్కరు ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంబరాల కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం  చేయాలని రాష్ట్ర న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో తెలుగు తల్లికి లక్ష స్వరార్చన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మంత్రివర్యులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ 37 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ఎంతో సంతోషకరమై వి షయమని ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు తెలుగు భాషను స్చచ్ఛమైనదిగా మాట్లాడెందుకు కృషిచేయాలని అన్నారు. ఈ ఉత్సవాలు 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగేలా కేబినెట్‌ సమావేశంలో ప్రస్థావిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మమ్మి, , డాడి అని పిలుచుకోకుండా స్వచ్చమై తెలుగులో అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలని అన్నారు. పాశ్చాత్యదెశాల సంస్కృతిని మనం అలవరచుకొన్నామని ఇది మకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు మంచిది కాదని తెలుగు భాషకు ప్రాధ్యాన్యతను  ఇవ్వాలని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ఇది ఎంతో మంచి అవకశామని తెలిపారు. డిసెంరు ల 27, 28, 29 తేదిలలో జరుగు ప్రపంచ తెలుగు మహాసభలకు గ్రావిూణ ప్రాంతాలనుండి సమాయత్తం త్‌త్తం అయి కర్నూలు జిల్లాకు మంచి పేరు తెచ్చి పెట్టాలన్నారు.  ఎమ్మెల్సీ సుధాకర్‌ బాబు మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు ఇంటికి వెల్తూ తమ తల్లి దండ్రులకు అమ్మ, నాన్న అని పిలువాలని లేకుంటే వారు తెలుగు వారు కాదని తప్పక తల్లిదండ్రులు తమ పిల్లలతో అమ్మ, నాన్న  అని పిలిపించుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలను తెలుగులో జరపాలని తెలియని రైతులు, పేదవారు వస్తారని వారికి తెలుగు భాషలో లేక సతమతమై పోతున్నారని  తెలుగు భాషకు ప్రాదాన్యతను ఇవ్వాలని అన్నారు.  అలాగే తెలుగు పండితులకు వెంట ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అప్పుడు తెలుగు భాషను  గౌరవించినవారమవుతామని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఎంతో గొప్పదని, నన్నయ్య  తిక్కన్న  ఎరప్రగడలు తెలుగు భాషను  ఎంతో గౌరంచి ఎన్నో  గ్రంధాలు రచలనువ్రాసి మ ఆంధ్రరాష్టాన్రికి ఎంతో గొప్ప తనముందని ఈ సందర్బంగా అన్నారు. ఈ కార్యక్రమం మతాలకు సంబంధించిది కాదని తెలుగు వారందరిది అని అన్నారు. మనమందరం స్వచ్చమై తెలుగుభాషను  అలవర్చుకోవాలని అన్నారు.  విద్యాలయాలలో వున్న ప్రిన్సిపల్స్‌, ప్రధానోపాధ్యాయులు తెలుగు భాష ప్రాధాన్యతను  గుర్తించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.   మ న సంస్కృతి, సంప్రదాయ/ఔల/హ మరచి పోవడం ఎంతో భాదాకరమని తెలుగు భాషను కాపాడాలని అన్నారు. జిల్లా కలెక్టరు సి.సుదర్శ/- రెడ్డి మాట్లాడుతు ప్రతి ఒక్కరు ప్రపంచ తెలుగు మహా సభల కార్యక్రమంలో పాల్గొని తెలుగు భాష ప్రాధాన్యతను గుర్తించి తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాలను  అలవర్చుకోవాలని అన్నారు. ఈ నెల నుండి వచ్చే నెల వరకు దాదాపు 2 మాసాలు ప్రపంచ తెలుగు మహా సభల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సాంస్కృతిక క్రీడా రచల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు రిగా పాల్గొని తెలుగు భాష ఔనత్యాన్ని  చాటి చెప్పాలని అన్నారు. జిల్లాలోని వివిధ కళారూపాల కళాకారులనైపుణ్యతను  సత్కరించడం కూడా జరుగుతుందని అన్నారు.