ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్21కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం వట్టిపెళ్లి ,బట్టుపల్లి గ్రామాల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లులు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఉప ఎన్నిక తెచ్చాడని మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా మునుగోడును పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి రాబోయే సంవత్సర కాలంలో ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అలాంటి వ్యక్తికి మనం మునుగోడు ఉప ఎన్నికను గెలిపించి కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాను అక్రమంగా సంపాదించిన డబ్బులను పంచి మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ గెలవాలనుకుంటున్నాడని అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అతనే అభివృద్ధి చెందుతాడని మునుగోడు వెనుకబడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్ష , కార్యదర్శి చందా శ్రీనివాస్, కాయిత రాములు, మాజీ జెడ్పిటిసి బెదరకోట రవీందర్, టిఆర్ఎస్ నాయకులు ఏరుకొండ సుధీర్, రుద్రారపు రవితేజ, కిటకిట రాజు తదితరులు పాల్గొన్నారు.