ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) :
ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించాలని ఏబిఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో ఏబిఎస్‌ఎఫ్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం వినయ్‌ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు కనీస వసతులు కరువ య్యాయన్నారు. పాఠశాలకు తాగునీరు, మరుగు దొడ్డు, మూత్రశాలలు లాంటి సౌకర్యాలు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా రన్నారు. అట్లాగే సబ్జెక్టులకు అనుగుణంగా ఉపా ధ్యాయులను నియమించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈసమావేశంలో ఆసంఘం నాయకులు వంశి, నవీన్‌, యుగేందర్‌, ప్రశాంత్‌, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.