ప్రభుత్వ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకోవాలి: శైలజానాథ్‌

హైదరాబాద్‌: దళిత, గిరిజన నిధులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని ప్రాథమిక విద్యాశాక మంత్రి శైలజానాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఉప ప్రణాళిక చట్టబద్ధత ఉండదంటోన్న వ్యాఖక్యలపై ఆయన ఈ రకంగా స్పందించారు. హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు కూడా దళితుల నిధులు మళ్లించిన సందర్భాలున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. తొమ్మిది, పదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కొత్త పథకం ప్రకటించడం కాంగ్రెస్‌ చిత్తశుద్దికి నిదర్శనమని ఆయన అన్నారు.