ప్రమాదస్థలిని పరిశీలించిన రైల్వే అడిషనల్‌ డీజీ కౌముది

హైదరాబాద్‌: నెల్లూరు రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని రైల్వే అడిషనల్‌ డీజీ కౌముది సోమవారం సాయంత్రం సందర్శించారు. ఈరోజు తెల్లవారుజామున నెల్లూరు సమీపంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఒక బోగీ అగ్నికి ఆహుతైన సంఘటనపై రైల్వే భద్రతా కమిషనర్‌ డీకే సింగ్‌ విచారణ చేయనున్నట్లు సమాచారం.