ప్రముఖులు ఓటేశారు..
హైదరాబాద్, మార్చి 22 : ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ నిదానంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని తార్నాకలో బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావు ఓటుహక్కు వినియోగించుకోగా వరంగల్ జిల్లా పర్వతగిరిలో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు, రాజేంద్రనగర్‌లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, రంగారెడ్డి జిల్లా తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా దమ్మపేట జిల్లా పరిషత్ స్కూల్‌లో మంత్రి తుమ్మల, నల్గొండలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో మంత్రి మహేందర్‌రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు.