ప్రయాణికుల భద్రత గాలికి

ఖమ్మం: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారిందని ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10లక్షలు ఇవ్వాలన్నారు.