ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రభుత్వం విఫలం: కడియం

హైదరాబాద్‌: ప్రాజెక్టుల పూర్తి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంకంటే ఆ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడంపైనే ప్రభుత్వతాపత్రయం ఉందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకులకు వ్యతిరేకం కాదని వాటిలో జరిగే అవినీతి, అక్రమాలకే వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా నీతిమంతుడు, నిజాయతీపరుడు అయితే తక్షణం సంబందిత దస్త్రాలను స్పీకర్‌ ముందుంచి శౄసనసభపక్ష నేతల సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.