ప్రాజెక్టు నిండితేనే ఆయకట్టుకు నీరు

కడెం : కడెం ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీటిమట్టం పెరగకపోవడంతో ఏం చేయలనే దాని పై ఈ రోజు నీటిపారుదల శాఖ అధికారులు కడెంలో సాగునీటి సంఘాల చైర్మెన్‌తో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 700 అడుగులు కాగా సోమవారం నాటికి 686.7 అడుగులు మాత్రమే ఉంది. దీంతో కనీస నీటిమట్టం 691 అడుగులు దాటితేనే కారీఫ్‌కు ఖరీస్‌కు నీటిని వదలలాని లేకపోతే ఆగస్టు 8 నుంచి చెర్వులు నింపేందుకు నీటిని వదలాలని సమావేశంలో తిర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్‌ఎస్పీ సీఈ శ్యామ్‌ సుందర్‌, ఈఈ రాములయ్య తదితరులు పాల్గున్నారు.