ప్రైవేట్ పిల్లల హాస్పిటల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 9(జనం సాక్షి)
చిన్నపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న పిల్లల హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్య కారణంగా పట్టణంలో సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్ల చిన్న పిల్లలు చనిపోతున్నారని వారికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని పసిపిల్లల ప్రాణాలు కాపాడాలని జిల్లా వైద్యాధికారికి ప్రభుత్వాన్ని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి డిమాండ్ చేశారు. శుక్రవారం
స్థానిక జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు నరేష్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ పసిపిల్లల ప్రాణాలను కాపాడాలని తల్లిదండ్రులు ఎంత డబ్బులైన ఖర్చు ఇస్తామని ఆసుపత్రికి వస్తే తీర సమయానికి పిల్లల వైద్యనిపుణులు వైద్యం సకాలంలో సరైన వైద్యం అందించకపోవడం వల్ల పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు వసూలు చేయాలని వివిధ పరీక్షల పేరుతో వైద్యులు ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ కేంద్రాల తో వారు పర్సంటేజ్ గా మాట్లాడుకుని అనవసరమైన పరీక్షలు చేస్తూ కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. జిల్లాలో ఎన్నో సంఘటనలు జరుగుతున్న జిల్లా వైద్య అధికారి నేటి వరకు ఏ ఒక్క హాస్పటల్ కూడా సందర్శించకుండా బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రైవేట్ ఆస్పత్రులపై నిజనిర్ధారణ కమిటీ వేసి ఎప్పటికప్పుడు తనకి నిర్వహిస్తే ఇటువంటి సంఘటనలు ఆరి కట్టవచ్చని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రైవేట్ హాస్పిటల్లో డెంగ్యూ వైరల్ ఫీవర్ వివిధ వ్యాధుల పేరుతో మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ తోక పేర్లు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు లక్షల్లో వసూలు చేస్తున్న అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ హాస్పటల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని పసిపిల్లల ప్రాణాలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. పసిపిల్లలు మృతి చెందిన అనంతరం హాస్పటల్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులతో డబ్బులు ఇచ్చి గట్టు చప్పుడు కాకుండా శవాలను ఇంటికి తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు తేజావత్ రాజు సునీల్ రాజేందర్ ప్రేమ్ సింగ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.