ఫిబ్రవరి 14లోగా సహకార ఎన్నికలు పూర్తి : మంత్రి కాసు కృష్ణారెడ్డి

హైదరాబాద్‌: ఫిబ్రవరి 14లోగా సహకార సంఘాలకు ఎన్నిలు పూర్తిచేస్తామని మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ నెల 10 నుంచి అందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వైద్య నాధస్‌ కమిటీ సిఫార్సుల మేరకు సహకార రంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి చెప్పారు.