ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలి : ఆర్కే సింగ్‌

న్యూఢిల్లీ : బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించే పోలీసులను సస్పెండ్‌ చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్‌ సూచించారు. ఫిర్యాదును పోలీసులు నమోదు చేయకపోవడం చట్ట విరుద్దమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గోని మాట్లాడారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం, కేసు గురించి వివరాలు తెలుసోవడం కఠిన తరంగా మారిందని చెప్పారు. మహిళలు, పేదలు, బలహీన వర్గాలు స్థానిక నేతల సహాయం లేకుండా పోలీసు స్టేషన్‌కు వెళ్లలలేకపోతున్నారని అన్నారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సామాన్యులు పోలీసు స్టేషనలె ఫిర్యాదు చేసే పరిస్థితి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఢిల్లీ అత్యాచర ఘటన నేపథ్యంలో మహిళలపై  అఘాయిత్యాలను నిరోదించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని అయితే ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.