ఫిలిప్పీన్స్‌లో టైపూన్: 200 మంది మృతి
మనీలా : శక్తిమంతమైన టైపూన్ ప్రభావానికి భారీ వర్షాలు కురిసి వరదలు ముంచుకురావడం, కొండ చరియలు విరిగిపడడం లాంటి సంఘటనలు వరసగా జరగడంతో ఫిలిప్పీస్స్‌లో 200 లకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 151 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. న్యూ బాతాస్ ప్రాంతంలో పలువురు గ్రామీణుల ఆచూకీ లేదని వారు పేర్కొన్నారు. ఒక్కసారిగా ముంచుకొచ్చిన వరదల్లో గ్రామీణులతో పాటు రెండు తుపాను పునరావాస కేంద్రాల్లోని వారు. సహాయ కారక్రమాలు చేపడుతున్న మిలిటరీ శిబిరాల్లోని సైనికులు కూడా కొట్టుకుపోవడం గమనార్హం.



