ఫ్యామిలీ క్లబ్‌ పై పోలీసుల దాడి

హైదరాబాద్‌:అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న ఓ ఫ్యామిలీ క్లబ్‌ పై పోలీసులు శనివారం అర్థరాత్రి దాడి చేశారు.35 మంది మందు బాబులను అరెస్టు చేశారు.బోయిన్‌పల్లిలోని ఏడు ఎకరాల స్థలంలో నేని హైటెక్‌ పేరిట క్లబ్‌ నిర్వహిస్తున్నారు.ఎక్సైజ్‌ శాఖ అనుమతి లేకుండా క్లబ్‌ లో మద్యం సరఫదా చేస్తుండడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.క్లబ్‌యజమాని శేఖర్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.