బంకరులో కూరుకుపోయి కార్మికుని మృతి

గోదావరిఖని: గోదావరిఖనిలోని గ్లోబల్‌ బొగ్గు శుద్ది కర్మాగారంలో పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తూ బంకర్‌లోకూరుకుపోయి మృతి చెందాడు. ఉదయం విధి నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కమాన్‌పూర్‌ మండలం పెంచుకల్‌పేటకు చెందిన సాగంటిస్వామిగా మృతున్ని గుర్తించారు.