బతుకమ్మ సంబరాలు ఆదివారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అంగరంగ వైభవంగా
ఖమ్మం కలెక్టరేట్ , సెప్టెంబర్ 25(జనం సాక్షి)
బతుకమ్మ సంబరాలు ఆదివారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బతుకమ్మ సంబరాల కోసం తొలిరోజున ఎంగిలిపూలతో బతుకమ్మలు పేర్చారు తంగేడు పువ్వు జిల్లేడు పువ్వు గునుగు పువ్వు బంతి చామంతి తీరొక్క పూలతో.. అందంగా బతుకమ్మలు పేర్చి అందులో పసుపు గౌరమ్మను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు అనంతరం బతుకమ్మ పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ .. అత్యంత ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలలో పాలుపంచుకున్నారు, అనంతరం మహిళలు ,యువతులు బతుకమ్మ ఆట పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు