బలహీన వర్గాలకు చెందినందువల్లే నా కొడుకుపై కేసు

హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు పోలీసులతో దరుసుగ ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదుచేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇక పైన తప్పుచేస్తే నేనే క్షమించనని అన్నారు. బలహీన వర్గాలకు చెందినందువల్లే నా కుమారునిపై కేసు నమోదు చేశారని పోలీసులు సరిగా వ్యవహరించి ఉంటే అసలు ఈ గోడవే జరిగేదికాదని అన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపాలని అన్నారు. తెలంగాణపై నేను ముందుడటం నచ్చని వారు గిట్టని వారు ఇలా చేస్తున్నారని ఆయన అన్నారు.