బస్సు ప్రమాదాలపై స్పందించిన సీఎం

హైదరాబాద్‌: నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. గాయపడినవారుకి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లును సీఎం ఆదేశించారు. రహదారుల స్థితిగతులను పరిశీలించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా రవాణాశాఖ అధికారుతకు స్పష్టం చేశారు.